మృతుని కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందించిన బ్యాంకు అధికారులు

 

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 24

ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, జమ్మికుంట శాఖ యందు ఖాతా కలిగి ఉండి ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి బ్యాంకు యొక్క ఖాతాదారు అయిన గాడి అనీల్ యొక్క కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారు. గాడి అనీల్ ఒక ప్రమాదంలో మరణించారు. మృతుడికి ది గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యందు గల గాయత్రి నిర్బయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదబీమా సౌకర్యం ద్వారా అతని తండ్రి అయిన గాడి రవీంధర్ కు 1లక్ష రూపాయల చెక్కును హూజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు మరియు బ్రాంచి మేనేజర్ ఒద్దుల మహేంధర్ చేతులమీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ ఖాతాదారులకు ఖాతాదారులకు కనీస డిపాజిట్ నే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పేద మరియు మధ్యతరగతి వినియోగదారులకు ప్రమాద భీమా కల్పిస్తూ వారికి అండగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. గాయత్రి బ్యాంకు వినియోగదారుల ఆర్ధిక ప్రగతికి సహకారం అందిస్తుందని అభినందించారు. 24 గంటలు ఏటీఎం లలో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా జమ్మికుంట మరియు పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను తీరుస్తుందని అన్నారు.

బ్రాంచ్ మేనేజర్ ఒద్దుల మహేంధర్ మాట్లాడుతూ

వినియోగదారులకు మైక్రో ఎటిఎం, ఏ ఈ పి ఎస్ సేవల ద్వారా వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై గ్రాముకు అత్యధికంగా 5,000/- తో ఋణాలను అందిస్తున్నారని, అలాగే రైతులకు వ్యవసాయ రుణాలను కూడా అందిస్తున్నారని తెలియజేశారు. జమ్మికుంట పరిసర గ్రామాలలో 16 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించారని, తద్వారా పెన్షనర్లు మరియు ఇతర ఖాతాదారులు ఇట్టి బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల వద్ద బ్యాంకు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలసిన ఫోటో మరియు జిరాక్స్లను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తున్నామని, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధికై ఋణాలను అందిస్తున్నామని వినియోగదారులు ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking