మర్యాదకపూర్వకంగా కలిసిన బద్దం సతీష్ గౌడ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ జి ఎచ్ ఎమ్ సి సర్కిల్ 14 డీ ఎమ్ సి గా నియామకమైన శ్రీమతి. ఉమా ప్రకాష్ ని మర్యాదకపూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించి నియోజకవర్గం లోని సమస్యల పైన వినతిపత్రం సమర్పించడం జరిగింది. గంఫౌండ్రి డివిజన్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ ముందు మరియు రంగమహల్ రోడ్ నుండి ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ వైపు వున్న ఫుత్ పాత్ ల పైన టెంపోరరీ వ్యాపారలకు అనుమతులు ఇవొద్దు అని ఇపుడు వున్న వాటిని తొలగించాలని కోరుతూ, ఈసమియా బజార్ లో మంజూరు అయిన రోడ్ లను వెంటనే వేయాలని రాబోవు వినాయకచవతి పండగ ముందే చేయాలనీ కోరడమైనది ఈ కార్యక్రమంలో బద్దం సతీష్ గౌడ్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,తెలుపుతూ చేతనే యూత్ కాంగ్రెస్ నాయకులు, కామలుద్దీన్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
Prev Post