అందోల్ నియోజకవర్గం లో పర్యటించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

👉 అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ హెల్త్ కేర్ హబ్ గా మారుస్తా

👉 మంత్రి దామోదర్ రాజనర్సింహ

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి (జులై 16 ప్రజాబలం )సంగారెడ్డి జిల్లా: నియోజకవర్గ కేంద్రమైన ఆందోల్ మండలంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు, ఈ సందర్భంగా పలు ప్రభుత్వ విద్యాసంస్థలు, వాటి నిర్మాణ పనులను, పరిశీలించి,అధికారులతో సమీక్షించారు, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అందోల్ నియోజకవర్గంన్ని, రాష్ట్రంలో ప్రత్యేక ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్ హబ్,గా అభివృద్ధి చేస్తామన్నారు,

                   

అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, విద్య,వైద్య, రంగాల్లో ప్రత్యేక హబ్, గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రాజెక్టులు చేపట్టినట్టు మంత్రి తెలిపారు, అందోల్ నియోజకవర్గం లోని (కేజీబీవి) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, పాఠశాలను మంత్రి సందర్శించారు, ఈ పాఠశాలలో (సిఎస్ఆర్) నిధులతో, నిర్మించిన ఆధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,కిచెన్ బ్లాక్, విద్యార్థుల కోసం అందిస్తున్న భోజనం మెనూ, మొదలైన వసతులను సమీక్షించారు, విద్యార్థులతో మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, నేడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు స్కూళ్ల కంటే, మెరుగైన మౌలిక వసతులతో ముందున్నాయని, విద్యార్థులకు క్వాలిటీ విద్యను నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నామని, మంత్రి తెలిపారు, అంతేకాక నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో, మౌలిక వసతులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు, ప్రతి పాఠశాలలో, డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీలు, కంప్యూటర్ విద్య, సైంటిఫిక్ ల్యాబ్స్ వంటివి అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి వివరించారు, తర్వాత మంత్రి నాందేడ్ ఫ్లైఓవర్ జాతీయ రహదారి నుండి అందోల్- జోగిపేట, పట్టణానికి నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు, రహదారి నిర్మాణం శర వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ, పర్యటనలో భాగంగా అందోల్ నియోజకవర్గం లో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న, నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు, కాలేజీ నిర్మాణ పనులను, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, వేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ,అధికారులను ఆదేశించారు, వీటితోపాటు మహిళా పాలిటెక్నిక్ కాలేజీని పరిశీలించారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాండు, సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండు, పట్ల ప్రవీణ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking