టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:హరీష్ రావు వాదనలలో పస లేదు..
ఢల్లీిలో నిన్న నీటి పారుదల అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం లు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ఏ అంశాలపై ఏమీ మాట్లాడారో స్వయంగా కేంద్ర మంత్రి సి.ఆర్ పాటిల్ చెప్పిన కూడా హరీష్ రావు పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూన్నాడు.
మీటింగ్ లో ఏఏ అంశాలు, ఏమి మాట్లాడారో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా హరీష్ రావు మెదడు కు ఎక్కనట్టు ఉంది.
హరీష్ రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప ఆర అంగుళం మెదడు పెంచుకోలేదు.. అడ్డగోలు వాదన అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు.
సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా లో మాజీ సీఎం, బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు సవాల్ విసిరారు..
అసెంబ్లీ వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా మేమే ఫామ్ హౌస్ కు వచ్చి అక్కడ మాక్ అసెంబ్లీ పెడుతాము మీరు పాల్గొనండి అని సవాల్ చేస్తే అక్కడ నుంచి నోరు లేవలేదు..
మీరు మళ్ళీ సిగ్గులేకుండా సవాళ్ల గురించి మాట్లాడుట్జున్నారు.
గోదావరి లో 3 వేల టి ఎంసీ ల నీటి వరద ఉంది.. ఆంధ్ర ప్రాజెక్టు లు కట్టుకున్నా మనకు సమస్య లేదు..
రాయల సీమ ను రతనాల సీమ చేస్తాను.. బెసీన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే కదా ఈ రోజు వాళ్ళు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నది .
తెలంగాణ కు అడ్డగోలుగా ద్రోహం చేసినా మీరే మళ్ళీ సిగ్గులేకుండా కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు.
మీకు దమ్ముంటే అసెంబ్లీ లో పెట్టె చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్ లు వచ్చి మీ వాదన చెప్పండి.. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తాది..
ప్రెస్ మీట్ లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మరు..