ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది
ఆత్మకూరు&దామర మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆత్మకూరు మండలం పరకాల నియోజకవర్గ ప్రతినిధి (ప్రజాబలం) జూలై 17: గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిఎస్ఆర్ గార్డెన్లో ఆత్మకూరు&దామెర మండలాల పరిధిలోని గ్రామాలలో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు రేషన్ డీలర్లు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ఆత్మకూరు మండలానికి చెందిన 428 మంది లబ్ధిదారులకు, అలాగే దామెర మండలానికి చెందిన 518 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ప్రజల సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత అని, కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం పదేళ్లపాటు నిరీక్షణ చేశారని, రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరమయ్యాయి అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు.పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి పథకాలను మంజూరు చేస్తున్నామని అన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగుతుందన్నారు