బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలో భాగంగా సొసైటీ గౌరవ సలహాదారులు పి కె మెహర్ అమెరికా నివాసి గారు పి వి పి రావు గారి జ్ఞాపకార్ధంగా ….24000/- రూపాయల విలువగల ప్రింటర్ ను ప్రైమరీ స్కూల్ కు బహుకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు కూడా ఆధునిక పరిజ్ఞానం లో రానించాలని ఆకాంక్ష తో గతంలో బెస్ట్ సేవా సొసైటీ వారిచే ప్రోజెక్టర్ , సిస్టమ్ ఏర్పాటు చేయనైనది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.కనకసేన గారు మాట్లాడుతూ స్వస్ధలం వదిలి హైదరాబాద్ స్థిరపడిన వై ఆర్ బాబు గారి ఆధ్వర్యంలో అందించిన ఈ సహాకారం పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అన్ని వేళల కక్కిరేణి గ్రామంలో గల పాఠశాలకు పలురకాలుగా ఆదుకోనుచున్నా బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య గారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ సర్పంచ్ పిట్ట కృష్ణ రెడ్డి గారు ప్రసంగిస్తూ బుక్కాఈశ్వరయ్య గారు గ్రామంలో సేవాకార్యక్రమాలు చేయడం ఆనందదాయకం, కరోనా సమయంలో కూడా చాలా సహాయం చేశారని యాబై సంవత్సరాల క్రితం ఊరినుండి వెళ్ళి పోయినా జన్మనిచ్చిన గ్రామం పై మమకారంతో సేవలందిండం మా అదృష్టం అన్నారు.
బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజర్ వేముల సైదులు ప్రసంగిస్తూ గ్రామంలో ఐక్యత పెంపోందించే దిశగా యువత నడవాడితనే ఇతర ప్రాంతలో స్థిర పడిన గ్రామవాసులకు గ్రామం పై మమకారం పెరుగుతుందని తద్వారా గ్రామ అభివృద్ది కి సహాయం సహకారాలు అందుతాయని అభిప్రాయ పడ్డారు..
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.గణేష్ , పి గోపాల్ రెడ్డి , వి.యోగి భాలి , భార్గవి , మల్లిక, ఈదులకంటి శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు..