ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల కృష్ణమోహన్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 30 (ప్రజాబలం) ఖమ్మం గత 15 రోజులుగా ఖమ్మం కొత్త కలెక్టరేట్ వద్ద ఏ ఎన్ ఎం లు దీక్ష ను కొనసాగిస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్ తెలియచేస్తూ రెగ్యులర్ చెయ్యాలి అని పరీక్షలు పెట్టకుండా అందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు ఈ సంద్భంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల కృష్ణమోహన్ మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు అక్క చెల్లెమ్మ ల కోసం ఏఎన్ఎం ల వ్యవస్థను తీసుకొని వచ్చి వారికి సముచిత స్థానాన్ని ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏఎన్ఎం అక్క చెల్లెమ్మలను విస్మరించాయి కరోన సమయములో మీరు సమాజానికి చేసిన సేవ మరువలేనిదని దీక్షకు దిగిన వారిని ఉద్దేశించి మాట్లాడారు మీ సమస్యలను షర్మిల అక్క దృష్టికి తీసుకొని వెళ్తా అని తెలియచేశారు ఏఎన్ఎం అక్క చెల్లెమ్మ లతో రాఖీ కట్టించుకున్నారు ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు