పది ఫలితాల్లో చరిత్ర సృష్టించిన గీతా విద్యా సంస్థలు.

10/10 జీపీఏ సాధించిన 27 మంది విద్యార్థులు.

మెదక్ ప్రాజబలం న్యూస్ :-

పది ఫలితాల్లో గీతా విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించారు. మెదక్ జిల్లా చరిత్రలో తొలిసారి 27 మంది విద్యార్థులు 10/10 జీపీఏ గ్రేడ్లు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గీతా విద్యా సంస్థల సెక్రటరీ రామాంజనేయులు, ప్రిన్సిపల్ మాధవి అభినందించారు. గత 30 ఏళ్లుగా విద్యారంగంలో ఉండడం నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించడం మా ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. కృషి చేసిన ఇంచార్జిలకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking