కేంద్రంలో మూడవ సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరం భైంసా లో జరిగిన మండలాల కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొన్న.బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
కేంద్రంలో మరో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరం అని అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,భైంసా మండల కేంద్రంలో జరిగిన కుభీర్, భైంసా మండలాల కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొని ఎన్నికలలో విజయ పతాకాన్ని ఎగరవేయడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. అబద్ధపు పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొత్త వాగ్దానాలను ఇస్తూ మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లో విస్త్రుతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, కాని మహిళా రిజర్వేషన్ తో పాటు ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం.ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ను అమలు పరిచిన ఘన చరిత్ర బీజేపీ పార్టీదని అలాంటి బీజేపీ పార్టీ పై రిజర్వేషన్ ల విషయమై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని,అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు..ప్రతి కార్యకర్త యుగపురుషుడైన నరేంద్రమోదీ ని మరో సారి ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా,మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు