ఆర్గానిక్ వ్యవసాయ ప్రభుత్వం సహకారం

 

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 30 :ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సేంద్రీయ వ్యవసాయం ను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రచిస్తున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలో వైశ్య భవన్ లో నిర్వహించిన హజీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘం – మంచిర్యాల జిల్లా కిసాన్ మేళా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దీళ్ళ శ్రీధర్ బాబు,మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి,గొనే శ్యామ్ సుందర్ రావు,చైర్మన్ లు,వైస్ చైర్మన్ లు,రైతులు,ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. ఏర్పాటుచేసిన కిషన్ మేళా ను మంత్రి దుర్బిళ్ళ శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… సేంద్రీయ వ్యవసాయం కు చేయూత ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి, ప్రజలకు ఎరువు రహిత ఆహార ఉత్పత్తులు అంది ఆరోగ్యంకు రక్షణ ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలని ప్రభుత్వ సహకారం ఎలా అందించాలనే కోణంపై మంత్రులు,అధికారులతో సమాలోచన చేశారని తెలిపారు.ముఖ్యమంత్రి తో సేంద్రీయ వ్యవసాయ రైతులతో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరిక మేరకు మంచిర్యాల లో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు.మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి,చెన్నూర్,మంచిర్యాల నియోజకవర్గాల్లో పండ్లు, కూరగాయలు పండించే రైతులు,చేపలు,పాడి,రైతులకు అందు బాటులో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.ఎన్నికల కోడ్ ముగిసిన పిదప భూసేకరణ చేయాలని అధికారులను పురమాయిస్తామని అన్నారు. మంచిర్యాల లో చేనేత దారులకు సౌకర్యం గా ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేస్తానని ప్రేమ్ సాగర్ రావు కు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… మంచిర్యాల లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం,ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేయాలనే వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం శ్రామిస్తుందన్నారు.రైతులు మూడు దశల్లో పంట మార్పిడి పంటలు వేయాలని సూచించారు. మొదటి దశలో వరి,రెండవ దశలో పప్పు దినుసులు, మూడవ పంటగా కూరగాయలు పండించాలని కోరారు.పంట మార్పిడి విధానం వల్లనే రైతులకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే విధానము కు రైతులు స్వస్తి పలకాలని సూచించారు. ఇక్కడ వనరులు,ఉత్పత్తులు, ఆదాయం ఇక్కడి వారే అనుభవించాలని ఆకాక్షించారు. ఆర్గానికి ఆహార ఉత్పత్తులు స్వీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు. విద్యాధికులు వ్యవసాయ రంగం వైపు మక్కువ చూపాలని ఎమ్మెల్యే వివేక్ పిలుపునిచ్చారు.ఆర్గానిక్ వ్యవసాయ రైతులకు ప్రభుత్వం ప్రోత్సహం అందించాలని గొనె శ్యామ్ సుందర్ రావ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మేళా సభ్యులు,రైతులు, సంబంధించిన అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking