తాడిచెట్టు పై నుండి గీత కార్మికునికి తీవ్ర గాయాలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 9

జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామానికి చెందిన బండి రమేష్ తండ్రి రాజీరు వృత్తి రీత్యా గీత కార్మికుడు రోజు లాగానే వృత్తిలో భాగంగా ఎడ్లపల్లి గ్రామంలో మంగళవారం రోజున సాయంత్రం తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకుజారి తాటి చెట్టు పై నుండి కింద పడగా స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. రమేష్ ను పరిశీలించిన పరీక్షించిన వైద్యులు ఎడమకాలు విరిగిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని రమేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి కాలుకు ఆపరేషన్ చేయించుకున్నాడు. రెక్క ఆడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన రమేష్ తాడిచెట్టు పై నుండి పడి గాయాలు కావడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేరా నిరుపేద కుటుంబానికి చెందిన బండి రమేష్ ను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గౌడ సంఘం నాయకులు పూదరి శ్రీనివాస్,చంద్రమౌళి తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking