పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి
పోలీస్ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. బుధవారము నిర్మల్ జిల్లా బరోసా కార్యాలయ ప్రాంగణంలో జిల్లా పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ బతుకమ్మకు పూజ కార్యక్రమం నిర్వహించి బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి తెలిపారు.పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మను అత్యంత వైభవంగా జరుపుకోవాలన్నారు.
జిల్లా ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ జరుపుకుంటారన్నారు. ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపిఎస్,సరోజినీ జిల్లా ట్రెజరీ అధికారిని, గంగా రెడ్డి డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్,అర్.ఐ లు ఎస్ఐ లు వారి కుటుంబ సభ్యులు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.