మెదక్ తూప్రాన్ అక్టోబర్ 9 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో గల మహిమగల మహంకాళి మాతను దర్శించుకొని అమ్మవారికి నాయకులు పట్లూరు శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
తూప్రాన్ పట్టణంలో దేవీ నవరాత్రుల భాగంగా సరస్వతి మాత అవతారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో నాయకులు పట్లూరి శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొని గత 26 సంవత్సరాలుగా మహంకాళి దేవాలయంలో అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవ్వేతంగా నిర్వహిస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోటేశ్వరరావు,మన్నే శ్రీనివాస్ ,,జానకిరామ్ గౌడ్,వెంకట్ నారాయణ,విట్టల్, నాగరాజ్,సురేష్, స్వాములు అమ్మవారి భక్తులు భారీగా పాల్గొన్నారు.
