– నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ ఆదేశాల మేరకు సంబరాలు.
– తీరొక్క పూలతో బతుకమ్మల అలంకరణ.
– ఆడి-పాడిన మహిళా కాంగ్రెస్ నేతలు.
– మహిళలకు గాజులు,పండ్లు,పూలు వాయినంగా ఇచ్చిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుశీల
– హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లొ
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 9
తీరొక్క పూలతో ప్రకృతిని దైవంగా భావించి ఆడబిడ్డలు జరుపుకునే పండుగ బతుకమ్మ అలాంటి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పూల జాతరకు కాంగ్రెస్ మహిళలు పెద్దఎత్తున వచ్చి పాల్గొని ఆడి,పాడారు. ఆద్యంతం వైభవంగా జరిగిన ఈ బతుకమ్మ సంబరాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఈ సంబరంలో పాల్గొన్న మహిళలకు బ్లాక్ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు ఆలేటి సుశీల గాజులు, పూలు,పండ్లు పంపిణీ చేశారు.మహిళల కొలాటాలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పండుగ శోభను సంతరించుకుంది.
కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి శివ-రేణుకా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల ఇల్లంతకుంట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొడం రజిత, మహిళా విభాగం నాయకురాల్లు కడారి తిరుమల, మల్లీశ్వరి, మంద మంజుల, పుల్ల రాధ, చిదిరాల సునిత, సొల్లు సునిత, యండి కరీమా, తోటస్వప్న, రజిత స్వరూప, రిబ్కా, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొల్లు బాబు, సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, ఉప్పరి శ్రీనివాస్, పటేల్ తాళ్ళపెల్లి రమేష్, ఎర్ర రవీందర్, గంట కిరణ్ రెడ్డి, యండి షాధిక్, యండి రియాజ్, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.