సెక్టార్ అధికారులకు ఎన్నికల సంబంధిత ప్రతి అంశం తెలిపి ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 14 : రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పోలింగ్ రోజులు పాటించవలసిన నిబంధనలు ఎన్నికల అధికారులు పూర్తిగా తెలుసుకొని ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు పాడిన అధికారి స్థానిక సంస్థలు డి.రాహుల్ , జిల్లా కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్ ఎల్.ఎ.ఆర్& ప్రత్యేక ఉప పాలనాధికరి డి.చంద్రకళ తో కలిసి సెక్టార్ పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఎన్నికల నిర్వాహణలో ప్రతి అంశాన్ని క్షేమంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల నిధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులకు వారి విందులు, ఎన్నికల నియమావళి సంబంధిత ప్రతి అంశం తెలుసుకోని ఉండాలని తెలిపారు ప్రతి సెక్టార్ అధికారి పరిధిలో కనీసం 3 నుంచి గరిష్టంగా 12 పోలింగ్ కేంద్రాలు ఉండాలని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు,క్యాంపు నీడ, మూత్రశారలు, కనీస మౌలిక సదుపాయాలు పరిశీలించి, ఏమైనా అవసరం ఉన్నట్లయితే సంబంధిత సహాయం ఎన్నికల రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమకూర్చాలని తెలిపారు. వల్నరబిలిటీ మ్యాపింగ్ -1 నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత పోలింగ్ కేంద్రాలను సందర్శించి వాటి పరిధిలో ఎల్లకొన్న సమస్యలను గుర్తించి ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రముఖులు సలహాలు తీసుకొని 3 రోజులు లేదు వ్యవధిలో వల్నరబిలిటి-2,3 నివేదికలు రూపొందించి అందించవలసి ఉంటుందని తెలిపారు. హెక్టర్ అధికారులకు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ప్రతి రూట్ తెలిసి ఉండాలని పోలింగ్ రోజు ఈ.వి.ఎం.,వి.వి. ప్యాకెట్లలో సమస్య కలిపినట్లయితే వెంటనే తీసుకోవావలసిన చర్యలు పోలింగ్ రోజు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించే మాక్ పోలింగ్ ప్రక్రియపై వివరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతరత్రా సంబంధిత పరికరాల పంపిణీ సమయంలో పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన ప్రకారం వచ్చిన వాటి వివరాలను పరిశీలించడం తెలిపారు.సెక్టార్ అధికారులు నిర్వహించవలసిన నిధులు. చేయవలసిన చేయకూడని పనులపై భారత ఎన్నికల సంఘం వారిచే జారి చేయబడిన హ్యాండ్ బుక్ చెక్ లిస్టులను క్షుణ్ణంగా చదవాలని, ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని, పోలింగ్ కౌంటింగ్ రోజున ఎలాంటి పొరపాట్లకు, తావు లేకుండా నిర్వహించవలసిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు బాధ్యత యుతంగా వ్యవహరించాలని,ఎలాంటి పొరపాట్లు జరిగిన భారత ఎన్నికల సంఘం నిబంధన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు,కంట్రోల్ యూనిట్,వి.వి.ప్యాట్ల ఏర్పాటు, పోలి రోజున ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం,హోల్ అయిన ఓట్ల వివరాలు నివేదిక, పోల్ ముగిసే సమయానికి ముందుగానే వచ్చి ఉన్న హోటల్లో విషయాలతో పాటించవలసిన నిబంధనలు,ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సీలింగ్,ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పని తీరును వివరించారు. సెక్టార్ అధికారులు,సెక్టార్ పోలీసు అధికారులు, సమన్వయంతో పని చేసే ఎన్నికల విజయవంరం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ అధికారులు,సెక్టార్ పోలీసు అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking