జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 2:
పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అదనంగా , బ్యాలెట్ యూనిట్ల యంత్రాల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజక వర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ లతో కలసి జిల్లా ఎన్నికల అధికారి మల్కాజిగిరి జిల్లాలో మొదటి రాండమైజేషన్ లో 3029 బ్యాలెట్ యూనిట్లను కేటాయించడం జరగగా, నామినేషన్ల ప్రక్రియ అనంతరం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున అదనంగా బ్యాలెట్ యూనిట్లు యంత్రాల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవిఎం యంత్రాల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. జిల్లాలోని మేడ్చల్ ,మల్కాజ్గిరి, కుకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ ఐదు నియోజకవర్గాలలో గల 2425 పోలింగ్ కేంద్రాలకు గాను ఆన్ లైన్ ద్వారా బ్యాలెట్ యూనిట్లు యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 591 పోలింగ్ కేంద్రాలకు 738 బ్యాలెట్ యూనిట్లు, కేటాయించగా, మల్కాజ్గిరి నియోజకవర్గానికి 418 పోలింగ్ కేంద్రాలకు 522 బ్యాలెట్ యూనిట్లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 592 పోలింగ్ కేంద్రాలకు740 బ్యాలెట్ యూనిట్లు, కుకట్ పల్లి, నియోజకవర్గం పరిధిలో 417 పోలింగ్ కేంద్రాలకు 521 బ్యాలెట్ యూనిట్లు, , ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో 407 పోలింగ్ కేంద్రాలకు 508 బ్యాలెట్ యూనిట్లు, మొత్తం 3029 బ్యాలెట్ యూనిట్లు కేటాయించడం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండంమై జేషన్ నిర్వహించి కేటాయించడం జరిగిందన్నారు. మొదటి సప్లమెంటరీ ర్యాండమైజేషన్ కు సంబంధించిన హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.