పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచాలి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.గురువారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మండలం లోని ఎల్లారం,కొత్తూర్,వెంకట్రావుపేట, కొమ్ముగూడెం,దౌడెపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు,ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలుకగా ప్రజలు వారితో ముందుకు కదిలారు,ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ…రానున్న పార్లమెంటు ఎన్నికలలో ప్రజల బాగు కోరే ప్రభుత్వం కేంద్రం లో రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశి కృష్ణను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపించాలని ప్రజలను కోరారు,యువకుడు విద్యావంతుడు అయిన వంశీని గెలిపిస్తే రానున్న రోజుల్లో యువతకు మంచి ఉపాది అవకాశాలు కల్గిస్తాడని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాడని అన్నారు.ఈ కార్యక్రమంలో లో జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం,పట్టణ అధ్యక్షుడు అరిఫ్,ఎంపీపీ అన్నాం చిన్నాన్న మంగ,డీసీసీ అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు, కౌన్సిలర్ రందేని వెంకటేష్, ఎంపీటీసీ సుజాత-సురేష్, అనుమండ్ల పద్మ,రవీందర్ రావు,సారం మధు,పూర్ణ చెందేర్ రావు,అంకతి శ్రీనివాస్ కొత్త వెంకటేశ్వర్లు,రందేని చిన్న వెంకటేష్,పయల్ శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
