హామీ ఇవ్వకపోయినా కాంగ్రెస్ అంకితభావం

 

-ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ చిత్తశుద్ధి

-హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ పులిపాటి ప్రసాద్

ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (ప్రజాబలం) ఖమ్మం ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఏనాడూ చెప్పకపోయినా ఆర్యవైశ్యుల పట్ల ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రదర్శించిందని ఆర్యవైశ్య సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక మేనిఫెస్టోలో కూడా ఆ పార్టీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన తేలేదని అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ప్రకటించడం గొప్ప పరిణామమని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం 2014 ఎన్నికల నాటి నుంచి తాము ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ కార్పొరేషన్ ఏర్పాటును విస్మరించిందని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటును మేనిఫెస్టోలో చేర్చనప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గంలో ఆమోదించి ఆర్యవైశ్యుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యదీక్షకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న తమ స్వప్నాన్ని కళ్ళ ముందుకు తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి కి ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని డాక్టర్ పులిపాటి ప్రసాద్ ప్రకటించారు.అలాగే అందని ద్రాక్షలాగే మిగులుతుందని భావించిన తమ కలని సాకారం చేయడంలో కృషి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తదుపరి స్వీట్స్ ను పంచిపెట్టారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు వనమా విశ్వశ్వరరావు సిద్దంశెట్టి శ్రీకాంత్ వెల్లంపల్లి సుబ్బారావు మృత్యుంజయ గుప్తా కొదుమూరు భద్రయ్య బూరెల పుల్లారావు నూకల వాసు తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking