జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 14 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం ఐడిఓసి సమావేశపు హాలులో ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా అటవీశాఖ అధికారి కోటేశ్వరరావు తదితర అధికారులతో జిల్లాస్థాయి ఆర్ ఓ ఎఫ్ ఆర్ కమిటి సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పూసుకుంట, ఆళ్లపల్లి, కరకగూడెం వంటి మారుమూల గిరిజన గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 634 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు బోర్లు వేసుకునుటకుగాను అనుమతి మంజూరు చేశారు. బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో భాస్కర్ నగర్ రోడ్డు కి సంబంధించి త్వరితగతిన ఫామ్ బి రిపోర్టు ఇవ్వవలసిందిగా డీఎఫ్ఓ కోటేశ్వరరావును ఆదేశించారుఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ , కర్క గూడెం జెడ్పీటీసీ కాంతారావు కలెక్టరేట్ ఓ ఎస్ డి రమాదేవి మరియు తదితరులు పాల్గొన్నారు.