కాకతీయ వైద్య కళాశాల విద్యార్థుల నిరాసన

కేఎంసీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మెడికొల ధర్నా
ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి14 /

కాకతీయ మెడికల్ కళాశాల పరిధి లో అధ్వానంగా మారిన రహదారులను సత్వరమే బాగు చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, కె యం సి వైద్య విద్యార్ధులు నిరాసన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీ చేత పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కే యం సి పరిధిలో ని రోడ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఈ విషయంగా అనేక సార్లు సంబధిత ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ఆవేదన ప్రభుత్వానికి తెలియాలని ఉద్దేశంతో గురువారం కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణం నుండి రోడ్డు కెఎంసి ప్రధాన గేటు వరకు రోడ్లు వేయాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు . మెడికల్ కళాశాల ఆవరణ లో రోడ్ల దుస్థితి, హాస్టల్ వసతి లో లోపాలుపై స్టూడెంట్స్ కి సరిపడా బస్సులు లేవు అని నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కానీ యెడల పోస్టింగ్స్, విద్యా కార్యకలాపాలను బహిష్కరణ చేస్తాం అని తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాల పరిధి లోని రహదారులు, వీధి దీపాలను వెంటనే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో తమ ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ధర్నాలో కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking