భద్రాచల రామాలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

భద్రాది కొత్తగూడెం ప్రతినిధి మార్చి 14 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో భద్రాచల రామాలయ అభివృద్ధి ప్రణాళిక మరియు భూసేకరణ తదితర అంశాలపై దేవాదాయ, రెవెన్యూ, భూమి మరియు కొలతలు, గ్రామపంచాయతీ మరియు ఐటిడిఏ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భూసేకరణ కు భద్రాచల తాసిల్దార్ గ్రామపంచాయతీ ఈవోరామాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మండల సర్వేయర్ తో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆలయ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణ కు సంబంధించిన ప్రణాళికలను మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇవ్వవలసిన అనుకూలమైన భూమిని గుర్తించవలసిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసి సోమవారం నాడు నివేదికలు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు భద్రాచల రామాలయ భూములకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆలయ ఈవో రమాదేవిని మరియు భద్రాచలం ఆర్డిఓ దామోదర్ ను ఆదేశించారు ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, భద్రాచలం తాసిల్దార్ శ్రీనివాస్, భూమి కొలతలు మరియు సర్వే ఏడి కుసుమకుమారి, కలెక్టరేట్ సూపర్డెంట్ రమాదేవి, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, కలెక్టరేట్ భూ సేకరణ సీనియర్ సహాయకులు యాసిన్ పాషా మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking