కాంగ్రెస్ పార్టీకి కూరగాయల వ్యాపారుల మద్దతు

 

మహంకాళి మాతకు ఓడి బియ్యం సమర్పించిన వ్యాపారులు

తూప్రాన్ మే 2 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణంలోని కూరగాయల వ్యాపారులు గురువారం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తూప్రాన్ మాజీ సర్పంచ్
ఆర్ వీర కుమార్ గౌడ్ ల సమక్షంలో కూరగాయల వ్యాపారులు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి పలువురు వ్యాపారులకు కాంగ్రెస్ కండువాలను కప్పారు. తమకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని కూరగాయల వ్యాపారులు నర్సారెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కూరగాయ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పసుల తిరుపతి, నాగరాజు సాప యాదగిరి లతోపాటు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిండ్ల జ్యోతి కృష్ణ ముదీరాజు , వైస్ చైర్మన్ శ్రీనివాస్,కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ , భగవాన్ రెడ్డి,రవీందర్ రెడ్డి , పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేత మహేందర్ ,మాజీ సర్పంచ్ వీరు కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ , పట్టణ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ గుప్త, కిష్ణారెడ్డి, నాగరాజు ,అజయ్,
చెలిమెల రఘుపతి, వ్యాపారస్తులు రాజు నాగరాజు పసుల తిరుపతి , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking