కుక్కలు విశ్వాసం గల జంతువులు.

సీనియర్ డా.దినేష్ సేవలు అభినందనీయం

శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 14 : కుక్కలు విశ్వాసం గల జంతువులని,మానవ మనుగడలో శునకాలు ఒక భాగమేనని,సీనియర్ డాక్టర్ దినేష్ సేవలు అభినందనీయమని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో డాక్టర్ దినేష్ నివాసంలో కుక్కలకు హైదరాబాదులోని పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ డాక్టర్ వెంకట్ యాదవ్ ను పిలిపించి డా దినేష్ తన సొంత ఖర్చులతో 20 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పెరుగుతున్న శునకాల వల్ల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు.ప్రతి సంవత్సరం అనేకులు కుక్క కాటుకు గురవుతున్నారని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.కుక్కల సంఖ్య తగ్గించి ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్నారు. మున్సిపాలిటీ వారు చేయవలసిన ఈ పనిని డాక్టర్ దినేష్ చేయడం పట్ల మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ నూనె ప్రవీణ్,డాక్టర్ ని అభినందించారు.ఈ కార్యక్రమంలో షేక్ చాంద్ కోమాకుల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking