ప్రజాబలం మంచిర్యాల జిల్లా మార్చి 14 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని శ్రీ శివ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో రెండు కుట్టు మిషన్ లను పంపిణీ చేయడం జరిగింది. గురువారం రోజున పాటిబంండ్ల స్వాతి శశిధర్ ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ సలీం కుతురు డాక్టర్ ఆఫ్రిన్ కుమార్తె అయిన మైరా జన్మదిన సందర్భంగా ఇద్దరు నిరుపేద మహిళలు అయిన కవిత మరియు విజయలక్ష్మి లకు కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాటిబండ్ల ప్రశన్న, రామమూర్తి . సుమతమ్మ ,డాక్టర్ సలీం డాక్టర్ ఆఫ్రిన్ ,భీమన్న, ప్రభాకర్,ధనలక్ష్మి తిరుపతి,శ్రీనివాస్,వినోద్ , మనీషా,పాల్గొన్నారు