ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివాజీ.
జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి మార్చి 14
ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెళ్లి శివాజీ ఆధ్వర్యంలో రవాణా, BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి రాష్ట్రంలో 22 జిల్లాలలో 8 లక్షల ఆరె కులస్తులు ఉన్నారని విరు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు గా చిరు వ్యాపారస్తులు గా జీవిస్తున్నారని 16 కులాలకు ఇచ్చినట్టుగానే ఆరె కులానికి కూడా రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలాగ చేయూత నివ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కన్వినర్ జెండా రాజేష్ ,ప్రధాన కార్యదర్శి బలేరావు మనోహరావు, రాష్ట్ర నాయకులు అధర్ సండే నాగేశ్వరరావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇంగిలే రామారావు, డివిజన్ ఇంచార్జి ఇంగిలే ప్రభాకర్, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.