మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్న మంత్రి సీతక్క
ములుగు జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 14:
మహిళలు ఆర్థిక,రాజకీయ
సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని
గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకిటి కరుణ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అవార్డు తో పాటు 1లక్ష రూపాయల చెక్కును అందించినరూ. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను శాలువా తో సత్కరించి అవార్డు తో పాటు పారితోషికం అందించి సీతక్క
అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగం లో రాణించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధితో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను గ్రామాలు, పట్టణాలకు విస్తరించడం, డ్వాక్రా గ్రూపులకు శాశ్వత బిల్డింగ్‌తో పాటు వారికి వడ్డీ లేని రుణాలు అందించడం, మహిళా కమిషన్‌ను బలోపేతం చేసి మహిళలకు రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పెద్ద ఎత్తున మహిళలు హాజరైనారు.