ప్రతి మహిళను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క…

 

ప్రజాబలం ములుగు జిల్లా ప్రతినిధి మార్చి 14::

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మహిళను కోటీశ్వరులుగా మార్చుటకు ప్రత్యేక దృష్టి సారించరని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క అన్నారు.
స్త్రీనిధి 41వ పాలక వర్గ సమావేశము, సెక్రటరీయట్ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం నిర్వహించరూ.
ఈ సమావేశములో, స్త్రీనిధి రాష్ట అధ్యక్షులు జి. ఇందిర అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిధి గా పాల్గొనీ, మంత్రి బోర్డ్ సభ్యులకు మార్గ నిర్దేశాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వము స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధికి ఎంతో అధికంగా కృషి చేస్తుందని, సంఘ సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సాకర్యము పెంపొందించుట కృషి చేస్తున్నారనీ, సంఘ సభ్యుల సంఖ్య 63 లక్షల నుండి కోటి వరకు చేయాలని ఉద్దేశించారు. సభ్యుల విజయ గాధ ఒక్క పుస్తక రూపంలో ప్రచురించి వాటిని సంఘంలో వివరించినప్పుడు అది ఇతర సభ్యులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనీ, ప్రభుత్వము సంఘాలకు వి ఎల్ అర్ సహకారము కల నెరవేర్చుటకు పూనుకున్నదని, సంఘాలు తమ సభ్యులు ఆదాయం పెంచుటకు కృషి చేస్తూ దుబారా ఖర్చులను తగ్గించుకొని రుణాలను సకాలంలో చెల్లించాలనీ అన్నారు. పాలకవర్గ సభ్యులుగా సంఘ సభ్యుల హార్దిక అభివృద్ధికి కృషి చేయవలసిన బాధ్యతతో పనిచేయాలనీ,
ఈ సమావేశంలో శ్రీనిధి ఆర్థిక సంవత్సరం 2022-23 కు గాను అర్జించిన నికార లాభములో ప్రభుత్వ వాటాదనాన్ని సంఘ సభ్యుల వాటా ధనము పై 14% డివిడెండ్ చెల్లించుటకు నిర్ణయించడం అయిందనీ, అంతేకాకుండా ప్రభుత్వ వాటాధనము పై చెల్లించే డివిడెండ్ ను స్త్రీనిధిలో ప్రభుత్వ వాటా దనము క్రింద జమ చేయుటకు సమాఖ్యల వాటాధనం పై చెల్లించే డివిడెండ్ లు 25% వరకు సమాఖ్యలపై డిపాజిట్ గా స్త్రీనిధిలో పొదుపు చేయాలనీ
మైక్రో ఫైనాన్స్ సంస్థలు రాష్ట్రంలో విస్తరిస్తున్న రుణాలను నివారించుటకు సంఘ సమాఖ్యలు తమ సమావేశాలలో సమీక్షించి సభ్యులకు అవగాహన పెంపొందించాలనీ సూచించారు. దీనిపై ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వము సంఘ మహిళల కొరకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాలను, బ్యాంకు లింకేజీ క్రింద పొందిన రుణాల కొరకు, మరియు ప్రమాద బీమా గా రూపాయలు 10.00 లక్షల వరకు అమలు చేసే పథకాలను శ్రీనిధి ద్వారా అమలు చేయుటకు నిర్వహించడం అయినదనీ నెల, స్త్రీనిధి కార్యక్రమాల అమలు పై సమీక్షనిర్వహిస్తామని తెల్పినారు.
పట్టణ ప్రాంతంలో మైక్రో ఎంటర్ప్రైజెస్ ల కొరకు రుణాలను దించుటకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలనీ నిర్ణయించడం అయినదనీ
ఆర్థిక సంవత్సరం 2022-23 కు గాను కోపరేటివ్ ఆడిట్ ద్వారా శ్రీనిధికి ఏ గ్రేడ్ రావడం జరిగిందనీ పేర్కొన్నారు.
శ్రీనిధి సిబ్బందికి వేతనాలు పెంచుటకు చర్యలు తీసుకునుటకు మరియు శ్రీనిధిలో సిబ్బందిని నియామకం చేపట్టుటకు నిర్ణయించడమైనది.
ఆర్థిక సంవత్సరం 2024-25 కు గాను రూపాయలు 2520 కోట్లు రుణ ప్రణాళిక గా నిర్ణయించడం అయినది ఇందులో సెర్ప్ ప్రాంతంలో రూపాయలు 1948 కోట్లు మెప్మా ప్రాంతంలో 572 కోట్ల వరకు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు సమావేశములో, ప్రిన్సిపాల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ గ్రామీణా భివృద్ధి శాఖ, సందీప్ కుమార సుల్తానియా, రిజిస్టర్ కో ఆపరేటివ్ సొసైటీ ఎం హరిత, మిషన్ డైరెక్టర్ డి. దివ్య, l, స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్, డి. కృష్ణ భాస్కర్, సేర్ఫ్ సీఈవో అనిత రామచంద్, స్త్రీనిధి, జి విద్య సాగర్ రెడ్డి, సీఈఓ, మాస్, టి సి ఎస్ రెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking