వనదుర్గా మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్

 

ప్రజాబలం దినపత్రిక పాపన్నపేట, మెదక్ జిల్లా 09.10.2024ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోకొలువైనటువంటి ఏడుపాయల వనదుర్గా మాత బుధవారం నాడు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ దంపతులు అమ్మవారిని దర్శనార్ధం విచ్చేయగా పురోహితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వీరు రాజగోపురం లో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్ననంతరం నవరాత్రులో భాగంగా గోకుల్ షెడ్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ ఎమ్మెల్యే రోహిత్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గోవింద నాయక్, శ్రీకాంతప్ప, భారత్ గౌడ్ స్థానిక సర్పంచులు కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking