-నెమలి పేటలో నీళ్ల సమస్య
బోరు మోటరు అలంకారప్రాయమేనా
నీటి సమస్యను తీర్చండి మా బాధను ఆలకించండి
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రూరల్ అదో ఒక గిరిజన గ్రామం. నీటి కటకటలు రోజురోజుకీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజాప్రతినిధులు మారుతున్నారు తప్ప.. ఆ గ్రామానికి నేటికీ సక్రమంగా నేటి సమస్య తీర్చిన నాధుడు లేకపోవడం శోచనీయం పట్టించుకోవలసినటువంటి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తుంది. మిషన్ భగీరథ మంచినీళ్లు సైతం వారానికి ఒకరోజు వస్తుందంటూ గ్రామస్తులు గిరిజనులు ఆరోపిస్తున్నారు. నీళ్లు లేక పడదాన్ని పాట్లు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకున్న నీళ్ల సమస్యను ఇప్పటివరకు తీర్చకపోవడం శోచనీయమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే నీటి కటకటలు వేధిస్తున్నాయంటూ గిరిజనులు మొర పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే అశ్వరావుపేట నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండలంలో నారాయణపురం గ్రామపంచాయతీలో ఉన్నటువంటి నెమలిపేట గ్రామంలో నాటి నుండి నేటి వరకు నీళ్ల సమస్య తీరనే తీరలేదు. నీటి సమస్యతో స్థానిక గిరిజనులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. పేరుకే ట్యాంక్ ఉంది గాని నీళ్లు ఎప్పుడూ పెద్దగా ఉన్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు సైతం వారానికి ఒకరోజు వస్తే ఏం సరిపోతాయంటూ.. ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఈమధ్య కాలంలోనే బోరు వేసి మోటార్ బిగించి అలంకారప్రాయంగా వదిలేశారే తప్ప ఆ బోరు మోటారు సైతం.. పాడైపోయిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హ్యాండ్ పంప్ సైతం సక్రమంగా లేకపోవడం పనిచేయకపోవడం సుదీర్ఘ ప్రాంతాలకు కాలినడకన వెళ్లి మంచి నీళ్లు తీసుకునే పరిస్థితి దాపురించిందంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోరు మోటారు.. అలంకారప్రాయమే.!?
నెమలి పేట గ్రామంలో వేసిన బోరు మోటర్ అలంకారప్రాయంగానే మిగిలిందంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు మోటర్ వేసి వారం కూడా గడవకముందే పాడైపోవడం నీళ్లు లేకపోవడం శోచనీయమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జెట్టి రాములమ్మ నెమలిపేట గ్రామం
నీళ్ల సమస్య ఎప్పుడు తీరుతుందో..!
అనేక సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుండి మాకు ప్రధానంగా వెంటాడే సమస్య నీళ్ల సమస్యని, ఆ సమస్యను నేటికీ అధికారులు పరిష్కారం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, ఈ మధ్యకాలంలోనే బోరు మోటారు వేశారు గాని.. నీళ్లు వచ్చిన పాపాన పోలేదని.. కనెక్షన్లు సైతం బోరు నుండి ఇళ్ళకిస్తానని చెప్పి ఇంతవరకు నీళ్ల సమస్యను పట్టించుకోవట్లేదని అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక గిరిజన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

పంచాయతీ కార్యదర్శి వివరణ
నీళ్ల సమస్యపై పంచాయతీ కార్యదర్శులు వివరణ కోరగా, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు