హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకుప్రైవేట్ వ్యక్తికి చెందిన భూమిని నిరుపేదలకు ఇప్పించాలని న్యాయవాది జిలాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.సోమాజీగూడ ప్రెస్‌క్టబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరుర్‌నగర్ మండలం మన్సూరాబాద్ గ్రామం సర్వేనెంబర్ 7లో అనిషా బి పేరిట ఉన్న భూమిపై 2010 నుంచి న్యా పోరాటం చేస్తున్నామని చెప్పారు.అనిషా బి కోరిక మేరకు ఆమె మనవడు యూసఫ్ ఖాన్ పేదలకు పంచేందుకు సిద్దంగా ఉండడంతో వారందరి తరపున కోర్టుకు విన్నవించగా , భూమిని పేదలకు అందించేందుకు సహకరించాలని ఆదేశాలు చేసినట్టు చెప్పారు.వికలాంగులు ,కడు దయనీయ పరిస్థితులను ఎదుక్కోంటున్న వారికి భూమిని పంచుతామని ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూమిని ఇప్పించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో షేక్ ఇజదాని, హై కోర్టు అడ్వకేట్ ఎన్.సునీల్, ఇమ్రాన్ తదితరులు పాత్గోన్నారు.