మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంగా బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు తూప్రాన్ మండల యుపిఎస్ కిష్టాపూర్ పాఠశాలలో పాఠశాలలో నూతనంగా వచ్చిన 12 మంది విద్యార్థుల తో ప్రధానోపాధ్యాయులు పట్లోరి లక్ష్మణ్ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సర్కార్ బడిలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం ఉచితంగా పాఠ్యపుస్తకాలు దుస్తులు కూర్చోవడానికి ఫర్నిచర్ చక్కని విద్యను బోధించే టీచర్లు తదితర సౌకర్యాల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు అనురాధ, విజయ, తల్లితండ్రులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్ మంజుల గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.