కలెక్టర్ కు వినతపత్రం అందించిన జిల్లా పద్మశాలిలు
జగిత్యాల ప్రతినిధి, జూన్ 14 (ప్రజా బలం) రాష్ట్రప్రభుత్వం పతిష్టాత్మకంగా బిసి కులవృత్తు
ల ప్రయోజనాన్ని చేపట్టిన బిసి కులవృత్తుల లక్షరూపాయల
పథకంలో పద్మశాలీలను చేర్చి లబ్ది చేకూర్చాలని జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం నేతలు కలెక్టర్కు ఇచ్చిన వినతిపత్రంలో
కోరారు. బుధవారం జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘ భవనంలో సమావేశమైన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చేట్ పెల్లి సుధాకర్ లు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఎందరో పద్మశాలి నిరుపేదలున్నారన్నారు.
కులవృత్తిని చేసుకుందామన్న
ఆర్థిక స్థోమత లేక దుకాణాల్లో వర్కర్లుగా పనిచేస్తున్నారన్నారు. ఇతర కులవృత్తులకు అందిస్తున్న తరహాలోనే పద్మశాలీ కులవృత్తిని బి.సి పథకంలో చేర్చి లక్ష్మరూపాయల లబ్ధి
చేకూర్చాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గడ్డం మధు, బోగ వెంకటేశ్వర్లు, కటుకం శ్రీనివాస్, వీరభత్తిని శ్రీనివాస్, తుమ్మ రాజేశం, శంకరయ్య, శ్రీనివాస్ తోపాటు వివిధ మండలాల పద్మశాలి అధ్యక్ష, కార్యదర్శులు, కులబాంధవులు పాల్గొన్నారు.