పేకాట అనుమతి తెచ్చుకో..!
జగిత్యాల అసెంబ్లీ పరిధిలోని ఓ ఎస్.ఐ తీరు
జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 12(ప్రజాబలం)పేకాట కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తొందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేకాటపై ఉక్కుపాదం మోపుతుంటే ఏకంగా ఓ మండల ఎస్.ఐ. పదిహేనువేల లంచంతో పేకాట అండిస్తున్న సంఘటన జగిత్యాల జిల్లాలో నెలకొంది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జగిత్యాల అర్బన్, రూరల్, సారంగా పూర్, బీర్పూర్, రాయికల్ మండలాలున్నాయి. వీటి పరిధిలోని ఒక మండల పరిధిలోని ఎస్.ఐ. తన పరిధిలోని గ్రామాల్లో పేకాట నిర్ములన దిశగా కృషిచేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఆ ఎస్.ఐ. తన పరిధిలోని గ్రామాల్లో పేకాట ఆడేందుకు పర్మిషన్లు ఇస్తున్నట్లు తెలిసింది. తమ ఇంట్లొగాని మరోచోట పేకాట ఆడించేందుకు ఎస్.ఐ.ని కొందరు సంప్రదించగా ఒక్కో టేబులు కు 15 వేల చొప్పున తీసుకొని అనధికార అనుమతి ఇస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కో ఒంట్లో ఒక టేబులు అనుమతితో రెండు టేబుళ్లు నడిపిస్తున్నా ఎస్.ఐ చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఆ మండల పరిధిలో పదిహేను పేకాట కేంద్రాలను నడిపిస్తున్నట్లు తెలియగా ఇవన్నీ ఎస్.ఐ. కనుసన్నలలోనే నడుస్తున్నట్లు మండల పరిధిలో ప్రచారం జరుగుతోంది. పోలీసుల రక్షణలోనే పేకాట కేంద్రాల నిర్వహణ సాగుతోందన్న ప్రచారం వివిధ మండలాల్లోని పేకాట రాయుళ్లకు వరంగా మారడంతో వివిధ మండలాల నుంచి పేకాట రాయుళ్లు తరలివస్తున్నట్లు తెలుస్తోంది. పదిహేను కేంద్రాల్లో 15 టేబుళ్లకు ఒక్కో టేబులుకు 15 వేల చొప్పున రెండు లక్షలకు పైగానే ఆ ఎస్.ఐ.అక్రమ మార్గంలో ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం అక్రమ పేకాట ద్వారానే ఆ ఎస్.ఐ. ఆదాయం ఇలావుంటే మిగతా ఇసుక, ఇతరత్రా అక్రమ వ్యాపారాలతో ఇంకెంత అదాయమో అంటూ ఆ మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో అవినీతిని సహించమంటూ జిల్లా పోలీసు అధికారులు స్పందిస్తున్న నేపథ్యంలో జిల్లా నిఘా విభాగంతో సంబంధిత ఎస్.ఐ. నిర్వాకం పై లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని సంబంధిత మండల ప్రజలు కోరుతున్నారు.