వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 11:
సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు గట్టిగా కౌంటర్ యిచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిపి పై చేసిన వాక్యాలకు స్పందిస్తూ మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను లక్ష్యంగా చేసుకోని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారనీ ఆన్న ఆయన ఇంతకాలం ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదనీ ప్రశ్నించారు. గతంలో నల్గొండ, ఖమ్మంతో పాటు ప్రస్తుతంలో వరంగల్ లో కూడ బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులను అరెస్ట్ అయ్యారనీ అప్పుడు చేయనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనీ అన్నారు. కేవలం బండి సంజయ్ అరెస్ట్ అయినందుకు ఉక్రోషంతో తనపై ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. తాను ఉద్యోగ రీత్యా పనిచేసిన ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటి గుర్తుపెట్టుకోని ఆత్మీయంగా పలకరిస్తారనీ, రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేస్తానని, రేపు పోలీస్ కమిషనరేట్ నిర్వహించే ప్రజావాణిలో నాదగ్గరికి ఎవరోస్తారో మీరే స్వయంగా వచ్చి చూడాలని కోరారు న్యాయం కోసం తన వద్దకు దళారులు రారని, కేవలం సామాన్యులు, న్యాయం కోసం నలిగిపోయినవారే నాదగ్గరకు వస్తారని, కేసుల పాలైన రౌడీలు, భూకబ్జాదారులు, పీ.డి యాక్ట్ బాధితులు, ఇతర నేరాలకు పాల్పడిన వారు తన బాధితులుగా యం.పి బండి సంజయ్ కుమార్ నీ కలిసి వుంటారనీ అన్నారు. తన పై చేసిన ఆరోపణలకు నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావడంలేదని, విజయవాడ ఆయేషా కేసు విషయానికి వస్తే ఈ కేసుపై బండి సంజయ్ పూర్తి అవగాహన లేదనీ, ఆకేసు తను చేసింది కాదని అయోష కేసుకు సంబంధించి బండి సంజయ్ ది అవగాహన రహిత్యమని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నేను ప్రమాణం చేసే ఉద్యోగంలో చేరాను కచ్చితంగా చేయాలంటే ప్రమాణం చేస్తాననీ వృత్తి ధర్మాన్ని ప్రజలు విశ్వశించారు కాబట్టే పాలభిషేకాలు చేశారని, బెదిరించి కేసును పక్కదారి పెట్టాలని చూడడం కోసం పోలీస్ కమిషనర్ స్థాయి అధికారిపై ఆరోపణలు చేయడం సరికాదని, విచారణ అధికారిని జాగ్రత్త అని హెచ్చరించడమంటే బెదిరింపులకు పాల్పడడం అవుతుందని. కోర్టుకు అన్ని సాక్ష్యాలను అధారాలు సమర్పించామని అన్నారు. బండి సంజయ్ తో తనకు ఎమైనా గట్టు పంచాయితీ ఉ దా అని ప్రశ్నించారు? అలాగే బండి సంజయ్కు చెందిన ఫోన్ మాదగ్గరకి రాలేదని, అర్ధరాత్రి 1.14 నిమిషాలకు చివరి కాల్ వుందని, రాత్రి ఆ ఫోన్ చివరగా లోకేషన్ బేజ్జంకి వచ్చిందని, బండి సంజయ్ ఉక్రోషంతో వున్నారని పరువు నష్టం దావా వేసుకోవచ్చని, నేను పరువు నష్టం దావా వేయనని, నాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని, విచారణ చేస్తున్న పోలీసులకు సెంట్టి మెంట్టు అంటూ అనేది ఏమి వుందవని అన్నారు. పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కాదని పరీక్ష పత్రం మాల్ ప్రాక్టీసు కేసు వ్యవహారానికి సంబంధించి చాలా మందికి నోటీసులు పంపామని, అందులో మీడియా ప్రతినిధులు కూడా
వున్నారని వాళ్ళను కూడా పిలుస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారీ, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్. ఏసిపి తిరుమల్ పాల్గోన్నారు.
Prev Post
Next Post