తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీహరి రావు.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లాతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కే) గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీల పథకాలను ఇంటింటికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ‌లో వ‌చ్చేది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని ధీమా వ్యక్తం చేశారు. స‌ర్వేలు కూడా అదే స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. దేశంలో ప్ర‌జ‌లు శాంతి, సౌభాగ్యాల‌తో జీవ‌నం సాగించాలంటే అది కేవ‌లం కాంగ్రెస్ ప్ర‌భుత్వంతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని తెలిపారు. డిసెంబర్ 30న బీజేపీ, బీఆర్ఎస్ డిపాజిట్లు గ‌ల్లంతు కాబోతున్నాయ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking