జిల్లాలో తనిఖీల్లో రూ.17,64 కోట్లకు పైగా నగదు, రూ.24, 66 కోట్ల విలువైన ఆభరణాలు తనిఖీల్లో స్వాధీనం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఇప్పటి వరకు అధికారులు, పోలీసులు రూ.17, 64,10,901 (పదిహేడు కోట్ల అరవై నాలుగు లక్షల పది వేల తొమ్మిది వందల ఒక్క రూపాయలు) నగదును, రూ.24,66,92,170 (ఇరవై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల తొంభై రెండు వేల ఒక్క వంద డెబ్బై రూపాయల) విలువ గల ఆభరణాలు, 84,445 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొన్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి 508 కేసులు నమోదయ్యాయని… 262 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా గ్రీవెన్స్ కమిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ జప్తు చేసిన నగదు, ఆర్టికల్స్ అప్పీల్ పై విచారణ నిర్వహణ,
తనిఖీల్లో స్వాధీనం చేసుకొన్న రూ. 4,20,90,417 నగదు తిరిగి అప్పగింత,,
ఈ మేరకు జిల్లా గ్రీవెన్స్ కమిటీ అధికారులు అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలించి అన్ని రకాల ఆధారాలు సరిగ్గా ఉన్న కేసులకు సంబంధించి రూ. 4,20,90,417 సంబంధిత వ్యక్తులు సరైన ఆధారాలు సమర్పించడంతో పూర్తి నగదు విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. దీంతో పాటు గ్రీవెన్స్ కమిటీకి 185 కేసులు రాగా అందులో 141 డిస్పోజ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఆరు కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఐటీ శాఖకు సంబంధించి ఒకటి, కమర్షియల్ ట్యాక్స్కు సంబంధించి (2) కేసు ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అధికారులు, పోలీసులు వాహనాలు, తదితరాలు తనిఖీలు చేపట్టడం, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తగా నగదును, ఆర్టికల్స్ తీసుకెళ్లేటప్పుడు సరైన రసీదులు, ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని, తనిఖీల సందర్భంలో వాటిని చూపెట్టలని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించరాదని ఈ విషయంలో అధికారులకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. అలాగే పట్టుకొన్న నగదును అన్ని రకాల రశీదులు, తగిన సాక్ష్యాలతో తిరిగి తీసుకొనేందుకు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఎఫ్–12లో గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ జిల్లా సహకార అధికారి శ్రీనివాసమూర్తి ఫోన్ నెంబర్ – 9100115724-, డీటీవో నర్సింహా రావు ఫోన్ నెంబర్ – 77999-34204, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, ఫోన్ నెంబర్ – 73309-99280 లో సంప్ర దించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.