ఎగ్జిట్ పోల్స్ నిషేదం

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలు, ప్రచురణలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశమున్నందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం –1951 లోని సెక్షన్ 126 ఎ ప్రకారం ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణలు, , ప్రసారాలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 7 గంటల నుండి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6. 30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై ప్రసారాలు, ప్రచురణలపై నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండు ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking