జగిత్యాల, నవంబర్ 1: సామాజిక న్యాయం కోసం న్యాయ వాదుల వేదిక అధ్యక్ష, కార్యదర్శులుగా వడ్లకొండ మహేందర్, అల్లే పురుషోత్తం ఎన్నికయ్యారు. బుధవారం న్యాయవాదుల ఆధ్వర్యంలో జగిత్యాలలో నిర్వహించిన సమావేశంలో ప్రజల అవసరాలు, ఉచిత న్యాయ సలహాలు వంటి అంశాలపై న్యాయవాదుల్లో చర్చ జరిగిందన్నారు. ఇదే సమయంలో ఒక కార్యవర్గం ఏర్పాటుకు ప్రతిపాదన రాగా ఇందులో “సామాజిక న్యాయనికై న్యాయవాదుల వేదిక” పేరిట ఏర్పాటు కాగా ఇందులో అధ్యక్షులుగా వడ్లకొండ మహేందర్, ప్రధాన కార్యదర్శిగా అల్లే పురుషోత్తం లు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి నక్కల సంజీవరెడ్డి తెలిపారు. మిగతా కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా రాగం రమేష్, నిర్వహణ కార్యదర్శిగా తిట్ల అరుణ్, కోశాధికారిగా గణేష్, కార్యవర్గ సభ్యులుగా కొలిపాక కరుణాకర్, గుగ్గిళ్ల రాజేందర్, భూస విశ్వదత్తు, దులూరి సాయి, మధులను ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ వేదిక ఏర్పాటు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
