కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఏడు సెగ్మెంట్లకు ఆరుగురి దరఖాస్తు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 23 (ప్రజాబలం) ఖమ్మం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ హైదరాబాద్ గాంధీభవన్ లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని మొత్తం పది సెగ్మెంట్లలో ఏడు సెగ్మెంట్లకు గాను ఆరుగురు తమ దరఖాస్తులను బుధవారం సమర్పించారు. జనరల్ స్థానాలైన పాలేరు, ఖమ్మం నుంచి ఏదొక సెగ్మెంట్లో అవకాశం ఇవ్వాలని కోరుతూ మాజీ డీసీసీబీ ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మువ్వా విజయబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ రిజర్వుడ్ స్థానాలైన ఇల్లందు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య), పినపాక (మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు), వైరా (విజయబాయి), అశ్వారావు పేట (జారె ఆదినారాయణ), ఎస్సీ రిజర్వుడ్ స్థానం సత్తుపల్లి (కొండూరు సుధాకర్) తమ దరఖాస్తును అందజేశారు