రాజన్న సిరిసిల్ల జిల్లా ,
ఒకటి జులై 2024,
ప్రజాబలం ప్రతినిధి ,
వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడికి చేయూతను అందించారు. సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ కు చెందిన బూర రవీందర్ వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా వాణికి వచ్చి సమస్యను రవీందర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్
అతడికి వినికిడి యంత్రాలు ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం కు సూచించగా, రెండు చెవులకు రెండు వినికిడి యంత్రాలు అందజేశారు. తన సమస్యను పరిష్కరించిన కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీడబ్ల్యూఓకు బూర రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు.