సరపల్లిలో బంగారం వెండి నగదు చోరీ

 

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 8, ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: తాళం వేసి ఉన్న ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, బంగారం,వెండి, ఆభరణాలు నగదు, ఎత్తుకుపోయిన సంఘటన ఉమ్మడి పుల్కల్ మండల పరిధిలోని, సరాపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుందని పుల్కల్ (ఎస్ ఐ ) క్రాంతి కుమార్ పాటిల్, కథనం ప్రకారం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి, గ్రామానికి చెందిన వంజరి స్వాతి, ఇంటిలో జరిగింది,జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న, సంతోష్ భార్య పిల్లలతో గ్రామంలో అద్దెకు ఉంటున్నారు, కుటుంబ సభ్యులందరూ, ఆదివారం సాయంత్రం హత్నూర మండలం మాదారం గ్రామానికి, దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి రాత్రి ఆలయంలోనే బస చేశారని, అయితే సోమవారం ఉదయం 6:30 గంటలకు వారి ఇంటికి చేరుకోగా,చూస్తే ఇంటి తాళం పగలగొట్టిన దృశ్యాలు చూసి కంగుతిని ఇంట్లోకి వెళ్లి చూడగా సామాను చిందరవందరంగా పడి ఉండటంతో పాటు, బీరువాలో దాచిన తులం బంగారం, నగలు, 29, తులాల వెండి,పట్టీలు, 20వేల రూపాయలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు, ఇది జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఎస్,ఐ, క్రాంతికుమార్ పాటిల్, క్లుస్ టీంతో,సంఘటన స్థలానికి చేరుకొని,దుండగుల వేలిముద్రలను, ఇతర ఆధారాలు సేకరించి,కేసునమోదుచేసి,దర్యాప్తుచేస్తూన్నట్లు,ఎస్,ఐ, వివరిచారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking