11 కోట్ల 15 లక్షల రోడ్ల నిర్మాణానికి భూమిపూజ
ప్రెస్ భవన్ కు 10 లక్షలు మంజూరు
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల, మార్చి 4,(ప్రజాబలం ప్రతినిధి)
జగిత్యాల పట్టణంలోని గొల్లపెల్లి రోడ్డు విస్తరణ పనులను వారం రోజుల్లో మొదలు కానున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం అభివృద్ధి పనుల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో బస్ డిపో దగ్గర 11 కోట్ల 15 లక్షల తో జిల్లా మెడికల్ కాలేజీ చుట్టూ రహదారుల అభివృద్దిలో భాగంగా చిన్న కెనాల్ నుండి రామాలయం వరకు రోడ్ల నిర్మాణం,బస్ డిపో నుండి మాతా శిశు సంరక్షణ కేంద్రం వరకు బిటి రోడ్డు, నటరాజ్ చౌరస్తా నుండి బసవేశ్వర విగ్రహం వరకు బిటి రోడ్డు,ఐ డి ఓ సి (నూతన కలెక్టరేట్) నుండి అంతర్గాం రోడ్డు వరకు 4 లైన్ల బిటి రోడ్డు (బ్యాలెన్స్ రీచ్) అభివృద్ది పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఉపయోగ పడుతుందన్నారు. జిల్లా నట్టనడుమన 500 కోట్ల వ్యయంతో కళాశాల ఏర్పాటు చేసుకొన్నామన్నారు. ప్రజలకు రవాణా దృష్ట్యా, వసతుల దృష్ట్యా అనువైన ప్రాంతంగా ఎంపిక చేయటం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ పనులన్నింటిని 4 నెలల్లో మొత్తం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాలకు 150 కోట్లు మంజూరు చేయటం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ కోసం మంత్రి హరీష్ రావు 15 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే చెప్పారు. 2 కోట్ల వ్యయంతో సిటి స్కాన్ ప్రారంభించుకున్నామని అన్నారు. వారంలో గొల్ల పెళ్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
నేటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చుట్టూ పక్కల జిల్లాల నుండి సైతం ప్రజలు వస్తున్నారని ఈ రకంగా ప్రజలకు వినియోగంలోకి వస్తోందన్నారు. కొందరు నాయకులు కావాలని తప్పుడు వార్తల ప్రచారంతో మెడికల్ కాలేజీకి అడ్డం పడ్డా నేడు ప్రజల ఆకాంక్ష మేరకు నడి బొడ్డున ఏర్పాటు చేసుకున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే యావర్ రోడ్డు వెడల్పులో అడ్డంకులు ఎదురవుతున్నాయని అవన్నింటిని అధిగమిస్తామన్నారు.1000 మీటర్ల పొడవునా ప్రభుత్వ స్థలాలు వెడల్పు చేసి అధునాతన డ్రైనేజీనీ ఏర్పాటు చేయటం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల కోసం 5 లక్షలు, పాత్రికేయుల కోసం ప్రెస్ భవన్ కు 10 లక్షలు ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరు చేశామని ఎమ్మెల్యే చేప్పారు.
అనంతరం లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జగిత్యాల పట్టణం అభివృద్ది చెందిందన్నారు. పట్టణ అభివృద్ధికి సంజయ్ అన్న చేసిన నిరంతర కృషితోనే ఇంతటి అభివృద్ధి అని చెప్పారు. మెడికల్ హబ్ గా జగిత్యాల జిల్లా కేంద్రం ప్రసిద్ధి చెబుతోందని చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్ లు వొద్ధి శ్రీలత, జుంబర్థి రాజ్ కుమార్, కెడిసిసి జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు,కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.