ఎన్నికల కేంద్రాల వద్ద అన్ని రకాల మౌలికవసతులు ఏర్పాటు చేయాలి
ఈనెల 12న ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్బాక్సులు, ఎన్నికల సామాగ్రి పంపిణీ
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 4:
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎలాంటివ ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీపీ జానకీ, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, ఏసీపీలు, తో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 14 పోలింగ్ కేంద్రాలు, పది లొకేషన్లు, సంబంధించి ఒక రోజు ముందుగానే ఈనెల 12న ఉదయం 8 గంటల నుంచి జిల్లా కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పాటు ఎన్నికల సామాగ్రిని అందచేయడం జరుగుతుందని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది ముందుగానే వచ్చి వాటిని తీసుకెళ్ళాలని తెలిపారు. జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి వెబ్క్యాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నామని పోలింగ్ జరుగుతున్న తీరు ఎప్పటికప్పుడు తెలుస్తోందన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించడంతో పాటు లైటింగ్, ఓటర్లకు ఇబ్బంది లేకుండా టెంట్ వేసి తాగునీటి వసతి తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించి పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులకు సూచించారు. అదే సమయంలో ఎన్నికల సామాగ్రి సమీకరణలో ఎలాంటి ఇబ్భందులు రాకుండా చూడాలని బ్యాలెట్ బాక్సులు, బ్యాలట్ పేపర్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు నుంచి పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు రిసెప్షన్ కేంద్రానికి చేరే వరకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 14 పోలింగ్ కేంద్రాలు, 10 లొకేషన్లు, వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈనెల 13న ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సరూర్నగర్లోని స్టేడియంకు తరలించి అక్కడ భద్రపర్చడం జరుగుతుందని అందుకు సంబంధించి పోలీసు బందోబస్తు మధ్య వాటిని చేరవేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీపీ జానకీ, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, , ఆర్డీవోలు రవి, మల్లయ్య, సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, ఏసీపీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.