సింగరేణిలో ఉద్యోగం దొరకడం అదృష్టం

-కారుణ్య నియామక పత్రాలను అందించిన జిఎం జి. దేవేందర్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 16 :

సింగరేణిలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం దొరకడం అదృష్టమని మందమర్రి ఏరియా జిఎం జి. దేవేందర్ అన్నారు. మందమర్రి ఏరియాలో కారుణ్య నియామకాల కింద 8 మందికి గురువారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కారుణ్య నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జి.ఏం మాట్లాడుతు మందమర్రి ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వార 1806 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు సమయాలు భిన్నంగా ఉంటాయని విధులకు గైర్హాజరు అయితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కావున కష్టించి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ్ ప్రసాద్,ఏ ఐ.టీ.యూ.సీ మందమర్రి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సి.ఎం.ఓ.ఏ.ఐ అధ్యక్షులు రవి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, డి.వై.పి.ఎం సత్య బోస్, రాజ లింగు (ఒ.ఎస్) , ఏ.ఐ.టీ.యూ.సీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఏ.ఐ.టీ.యూ.సీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking