రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు చేయండి

 

-మందమర్రి ఏరియా జిఎం జీ. దేవేందర్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 16 :

సింగరేణి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మందమర్రి ఏరియ జనరల్ మేనేజర్ జి.దేవేందర్ ఆదేశించారు. గురువారం స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జి.ఎం మాట్లాడుతూ మందమర్రిలోని స్థానిక సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో వైభవంగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు తగు సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ ప్రసాద్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, డి.వై జి.ఎం ఈ అండ్ ఎం వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్,డీ.జీ.ఎం.ఐ.డి రాజన్న, సివిల్ ఎస్.ఈ రాము, పలు డిపార్ట్మెంట్ల అధికారులు, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking