-సంవత్సరం గడిచిన సమస్యలు పరిష్కారం కాలే
-ఐ.ఎన్.టి.యూ.సి నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 16 :
సింగరేణిలో గుర్తింపు సంఘమైన ఏఐటియూసి యాజమాన్యంతో కుమ్మక్కైందని ఐ.ఎన్.టి.యూ.సి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య, సీనియర్ నాయకులు దేవీ భూమయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ శెట్టి నరేందర్ లు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఐ.ఎన్.టి.యూ.సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటియూసి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గెలిచి సంవత్సరం గడిచినప్పటికి కార్మికుల సమస్యలు ఏమి పరిష్కారం కాలేదని మండిపడ్డారు. మందమర్రి ఏరియాలో రాబోయే రోజుల్లో కేక్ -5 గని, అర్.కే.పి ఓ సి మూతపడే అవకాశం ఉన్నదన్నారు. మందమర్రి ఏరియాలో సుమారు 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని వారి భవిష్యత్తు కోసం నూతన గనులు తేవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సింగరేణిలో అధికారులు నాయకులు కార్మికుల విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే గుర్తింపు సంఘంకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ కార్యదర్శిలు పానుగంటి వెంకటస్వామి, అలుగుల రవి, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శంకర్రావు, సెంట్రల్ కమిటీ మెంబర్ మేడ సమ్మయ్య, ఏరియా కార్యదర్శి బిక్షపతి, కే కే -5 ఫిట్ సెక్రెటరీ భీమారపు సదయ్య కాసిపేట 2 ఫిట్ సెక్రటరీ కారుకూరి తిరుపతి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్, కలమంద స్వామి, మేకల రాజయ్య, పెద్దపల్లి రాజం, ఈదుల పోషం లు పాల్గొన్నారు.