* అనంతరం ఘనంగా సన్మానించిన
….నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి
సంగారెడ్డి జనవరి16 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగల్ల శివరామకృష్ణ కు ముషీరాబాద్ లోని సిటీ కల్చరల్ ఆడిటోరియం లో ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసారని గుర్తు చేసిన సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శివరామకృష్ణ అణగారిన వర్గాల కోసం చేసిన సేవలు మరియు ఉద్యమ పోరాట ఫలితమే ఈ యొక్క డాక్టరేట్ అవార్డు అని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి డాక్టర్ దక్కినందుకు చాలా సంతోషం వ్యక్తం అన్ని అన్నారు. ఈ సందర్బంగా అవార్డు గ్రహీత శివరామకృష్ణ మాట్లాడుతూ నన్ను సన్మానించిన నర్సాపూర్ శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో హత్నూర ఎంపీపీ వావిల్ల నర్సింలు, అంబటి అర్జున్ , ముక్కిడి రాములు, ఎంపీటీసీ అగమయ్య సర్పంచ్ లక్ష్మీనారాయణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు
