ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ జనవరి 16:జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం నుండి రాష్ట్రంలో రైతులకు ఎకరాకు రూ 6 వేల రైతు భరోసా, అర్హులైన ఇళ్ల స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం అమలుపరుస్తుందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో రూ.44 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తో,ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ తో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
రూ.38కోట్ల అమృత్ పథకం నిధుల తో 5 మంచినీటి ట్యాంకులు, రూ. 6 కోట్ల నిధులతో అంతర్గత సిసి రోడ్లు మరియు యూజీడీలు, రూ. 25 లక్షల నిధులతో తుమ్మ చెరువు కట్టకు కంచె తదితరాలను చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జనవరి 26 నుండి సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో ఎకరాకు 6000 రూపాయల రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితర కార్యక్రమాలను అమలు చేయబోతున్నా మనీ మహేందర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో సాగుతున్నా యని మహేందర్ రెడ్డి వెల్లడించారు.