మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 16: క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి వ్యవసాయానికి యోగ్యమైన భూమియేనా కాదా అనేది కచ్చితంగా గుర్తించి, వివరాలను జాగ్రత్తగా డాటా ఎంట్రీ చేయించాలని కీసర తహాసీల్దారును మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం ఆదేశించారు.గురువారం కీసర ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రామాలలో సర్వే నంబర్ల వారిగా వ్యవసాయ, వ్యవసాయేతర భూమలను గుర్తించే క్షేత్రస్థాయి పర్యటనల వివరాలను జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టరు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిపిఆర్ మ్యాప్ ద్వారా పరిశీలిస్తూ క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి వ్యవసాయ యోగ్యమైనదా, వ్యవసాయ యోగ్యం కానిదా అని కచ్చితంగా గుర్తించాలని తెలిపారు. గ్రామాల వారీగా నిర్వహించే తనిఖీల నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను తయారు చేసి డాటా ఎంట్రీకి ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలన జరగవలసిందేనని కలెక్టరు స్పష్టం చేసారు. అవసరమైన చోట సర్వేయర్లద్వారా సమాచారం సేకరించి లే అవుట్లు, నాలాగా మార్చిన భూములను, ఇండస్ట్రీలకు సంబంధంచన వివరాలను జాగ్రత్తగా సేకంచాలని కలెక్టరు సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టరు మ్యాప్ ద్వారా చీర్యాల, గోధుమకుంట గ్రామాల సర్వే నంబర్ల ద్వారా కలెక్టరు పరిశీలించి అవసరమైన సలహాలను, సూచనలను వివరించారు.
ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్ చంద్రావతి, కీసర తహాసీల్దారు అశోక్ కుమార్, ఆర్ ఐలు, తహాసీల్దారు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.