బీ.ఆర్.ఎస్ నాయకుల గుడ్ మార్నింగ్ మణికొండ

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 24 మార్చి 2025
గుడ్ మార్నింగ్ మణికొండ పెర బీ.ఆర్.ఎస్ పార్టీ మార్నింగ్ వాక్ సోమవారం రోజున అంజలీ గార్డెన్ వీదులలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ల్యాంకో హిల్స్ నుండి ఎగుడు దిగుడు రహదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రేడియేల్ రోడ్ అసంపూర్తిగా ఉన్న కారణంగా ప్రధాన రహదారిగా మారడంతో ట్రాఫిక్ సమస్య జాస్తిగా ఉండి ప్రమాదాలకు తావిస్తున్నదని అందువలన కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ అవసరం ఎంతైనా ఉందని మొరపెట్టుకున్నారు. ఇట్టి రహదారి మధ్య మధ్యలో డ్రైనేజీ లైన్ పై దెబ్బతిని ఎప్పుడు కుంచించుకు పోతుందో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియ కుండా ఉన్నదని భయ బ్రాంతులలో స్థానిక ప్రజలు తెలియ చేస్టు, కొన్ని ఇండ్లకు ఇప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ లేదని వాపోయారు. త్రాగడానికి మంచినీరు వేళా ఫాళ లేకుండా నిర్ణీత సమయంలో రాకుండా ఇష్టానుసారం అరగంట నుంచి 45 నిమిషాలు మాత్రమే రావడం వలన నీటి ఎద్దడితో ఇబ్బందుల పాలు అవుతున్నారని తెలియ పరచారు. అల్లంత దూరాన కల ఈ.ఐ.పీ.ఎల్ రెడీ మిక్స్ ప్లాంట్ వల్ల వాయు కాలుశ్యంతో దగ్గు దమ్ము బారిన పడి స్థానికులు నానా ఇబ్బంది పడుతున్నారని బాధపడ్డారు. స్థానిక పిల్లలు పెద్దలు వీధి కుక్కల బారిన పడి ఇబ్బంది పడుతున్నారనీ తెలియ చేసారు. కావున సదరు ప్రభుత్వ అధికారు లందరూ పై సమస్యలకు పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేందర్నాధ్ రెడ్డి, కిరణ్ యాలాల, సుమనళిని, బొడ్డు శ్రీధర్, రమణ మూర్తి తది తరులు తెలియ పరచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking